BREAKING
ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు. : దర్శిలో ఎల్ఈడి స్క్రీన్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. పేద విద్యార్థిని లండన్ చదువుకు ఆసరా..పెద్ద మనసు చాటుకున్న ఎంపీ క్యాతనపల్లి 18వ వార్డులో ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల లో విజయం సాధించిన అభ్యర్థులతో మాట్లాడుతున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి వెంకటగిరి ఎంపీపీ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం – ఎంపీ గురుమూర్తి ఒరిస్సా కి చెందిన 7 గురు కార్మికులకు వెట్టి చాకిరి నుండి విముక్తి – DBRC కృషితో కదిలిన అధికార యంత్రాంగం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించిన డా. సాయి సువర్దన్‌కు ఘనంగా సన్మానం. : ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు , డిసెంబర్ 22న తుది జాబితా ములకలేడు ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన రామలక్ష్మి వైసిపి అభ్యర్థులను గెలిపించండి ఎంపిపి సునీత దంపతులకు జీడీపప్పు మాలతో సత్కారం విజ్ఞాన భాండాగారంగా కలెక్టరేట్ గ్రంథాలయం శాంతారాం జై పవర్ కుటుంబ సభ్యులను కలిసిన వైసిపి నేతలు లక్ష్మంపల్లి ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసిన మాల మర్రి స్వామి

అక్వాన్‌ తుపానుపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం నెల్లూరు నుంచి విశాఖ వరకు ప్రత్యేక నిఘా, సిబ్బంది,సామాగ్రి కోసం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రికి గొట్టిపాటి లేఖ

Select Suryaa Now
అక్వాన్‌ తుపానుపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం  నెల్లూరు నుంచి విశాఖ వరకు ప్రత్యేక నిఘా,   సిబ్బంది,సామాగ్రి కోసం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రికి గొట్టిపాటి లేఖ

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

 అక్వాన్‌ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ ఆదేశించారు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తుపాను ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున, విద్యుత్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మూడు డిస్కంల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రత దృష్ట్యా విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు సిబ్బంది అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించారు. అర్నాబ్‌, మురసు తుపానుల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అక్వాన్‌ తుపాను సహాయక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. విద్యుత్‌ స్తంభాలు కూలిపోయినా, సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి, ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా విద్యుత్‌ సిబ్బంది పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేసినా, తుపాను కారణంగా అంతరాయం ఏర్పడినా వినియోగదారులకు ముందుగానే సమాచారం అందించాలని సూచించారు.