BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి

- రైతులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్‌

పామూరు, మేజర్ న్యూస్ : ఎరువుల కొనుగోలులో రైతులకు మరింత సౌలభ్యం కల్పించడంతో పాటు విక్రయాల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్‌ అన్నారు. బుధవారం పామూరు పట్టణంలోని ముప్పసాని శ్రీనివాసులు ఫర్టిలైజర్స్‌ దుకాణాన్ని కనిగిరి ఏడీఏ జైన్‌ లుద్దీన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణానికి వచ్చిన రైతులతో మాట్లాడి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ వినియోగం దాని ద్వారా ఎరువుల కొనుగోలు చేసే విధానంపై అవగాహన కల్పించారు. రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం నిర్దేశించిన ఆన్‌లైన్‌ విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. యాప్‌ ద్వారా ఎరువుల విక్రయాలు పారదర్శకంగా సాగుతాయని ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు సక్రమంగా అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని వివరించారు. రైతులు యాప్‌ వినియోగంపై అవగాహన పెంచుకొని వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అబ్రహం లింకన్, విస్తరణాదికారి నగేష్, ముప్పసాని శ్రీనివాసులు ఫర్టిలైజర్స్ అధినేత ముప్పసాని క్రాంతి, రైతులు పాల్గొన్నారు.