BREAKING
మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఒంగోలు RDO చంద్రశేఖర నాయుడు. వైకాపా ఎంపీటీసీ సభ్యుడు కిడ్నాప్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి : ఎంపిపి ఎన్నికను ప్రభావితం చేసేందుకే కిడ్నాప్ : ఎస్పీకి ఫిర్యాదు చేసిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,వి.ఎస్.రెడ్డి గ్లోబల్ పేటెంట్ దరఖాస్తులలో సరికొత్త రికార్డు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రానే మాకు అసలు సిసలు సవాల్: న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ సలకలవీడు సర్పంచ్ అభ్యర్థిగా బిక్క కోటమ్మ నామినేషన్ దాఖలు ఐరోపాలో కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్టుల సవాళ్లు జీజీహెచ్ కు స్ట్రచర్లను అందజేసిన స్వచ్ఛంద సేవకులు అవకాశం ఇవ్వండి పెద్దకూరపల్లి పంచాయతీని అభివృద్ధి చేస్తా : వైసీపీ బలపరిచిన అభ్యర్థిని కె.దవణమ్మ విజ్ఞప్తి జిల్లా పరిషత్, మండల పరిషత్ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అక్వాన్‌ తుపానుపై విద్యుత్‌ శాఖ అప్రమత్తం నెల్లూరు నుంచి విశాఖ వరకు ప్రత్యేక నిఘా, సిబ్బంది,సామాగ్రి కోసం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రికి గొట్టిపాటి లేఖ హైవే ప్రాంతంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్‌ను కలిసిన సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ప్రముఖ గాయకుడు జూలియో ఇగ్లేసియాస్‌పై లైంగిక వేధింపుల దర్యాప్తునకు ఆదేశం మర్రిపాడు ఎంపీపీగా పుట్టం ప్రమాణ స్వీకారం 64 ఏళ్ల వయసులోనూ తగ్గని ఫిట్‌నెస్.. తన ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా

నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య

Select Suryaa Now
నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య

​పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో సబ్ యూనిట్ అధికారి సిద్ధయ్య ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని క్షుణ్ణంగా పరిశీలించి, దోమల లార్వా ఉన్న ప్రాంతాల్లో అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
​అనంతరం సబ్ యూనిట్ అధికారి సిద్ధయ్య మాట్లాడుతూ.. ప్రజలు తమ నివాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పాత్రలలో వారానికి మించి నీటిని నిల్వ చేసుకోకూడదని, ఇళ్ల ముందు చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక విషజ్వరాలు దరిచేరకుండా ఉంటాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా నిల్వ ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెట్టి లార్వా వేగంగా వృద్ధి చెందుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం తప్పనిసరిగా 'డ్రై డే'గా పాటించి ఇళ్లను, పరిసరాలను పొడిగా ఉంచుకోవాలని తెలిపారు.
​నీటి తొట్టెలు, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ వ్యర్థాలలో వర్షపు నీరు చేరకుండా ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రం చేసుకోవాలన్నారు. దోమల నివారణ, పరిశుభ్రత విషయంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఎవరికైనా జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు శేషగిరి నాయక్, లక్ష్మి, స్వర్ణ, ఆశా కార్యకర్త సునీత తదితరులు పాల్గొన్నారు