BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

Select Suryaa Now
పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

- టీడీపీ నాయకులతో కలిసి షంషూర్ ఎన్నికల ప్రచారం

 పామూరు, మేజర్ న్యూస్ : పామూరు అభివృద్ధే తన లక్ష్యమని ప్రజాసేవకే అత్యంత ప్రాధాన్యమిస్తానని పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్డీఏ కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్ పేర్కొన్నారు.ప్రజల ఆశీస్సులు ఆదరణతో సర్పంచ్‌గా ఎన్నికై పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాననే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గీయ బాలెరంతుసాహెబ్ తనయుడైన షంషూర్ బుధవారం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని సమస్యలు, అభివృద్ధి పనులు, వార్డులవారీగా ప్రచార నిర్వహణపై నాయకులతో చర్చించారు. ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందించాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన షంషూర్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. పట్టణంలోని ప్రతి వార్డులోనూ ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తండ్రి స్వర్గీయ బాలెరంతు సాహెబ్‌కు ఉన్న పేరు ప్రతిష్ఠలను నిలబెడుతూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని షంషూర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.