BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు

Select Suryaa Now
పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు

పామూరు, మేజర్ న్యూస్ : ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాస కొరత ఏర్పడకుండా 500 ఎకరాల్లో పచ్చిమేత సాగుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పశుసంవర్ధక వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పశువులకు మేత కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎం  విజయ సునీత ఆదేశాల మేరకు బుధవారం మోపాడు జలాశయాన్ని సందర్శించి పశుగ్రాస సాగుకు అనువైన భూములను పరిశీలించారు. జలాశయం పరిధిలో 500 ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేసేందుకు ఉన్న అవకాశాలు, నీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించి అంచనా వేశారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు. మోపాడు జలాశయం పరిధిలో పశుగ్రాస సాగుకు అవసరమైన సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి. శ్రీనివాసమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి డి. బాలాజీనాయక్, కనిగిరి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరెడ్డి, కనిగిరి వ్యవసాయ సహాయ సంచాలకులు షేక్ జైనులుద్దీన్, మోపాడు జలాశయం చైర్మన్ చుంచు కొండయ్య, వైస్ చైర్మన్ మోరబోయిన నరసింహారావు, మోపాడు, కంబాలదిన్నె ఎంపీటీసీలు మోరబోయిన గిడ్డయ్య, పోక వెంకటరత్నం, వెంకటనారాయణ, పామూరు తహసీల్దార్ ఆనాటి లక్ష్మీనారాయణ, పామూరు, సీఎస్‌పురం పశువైద్యాధికారులు డాక్టర్ ఆర్. హనుమాన్ సాహెబ్, డాక్టర్ షేక్ మునీర్, పామూరు వ్యవసాయ అధికారి అబ్రహం లింకన్, ఇరిగేషన్ ఏఈ సీహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.