BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక

Select Suryaa Now
ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక

ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక

★ మండల మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్‌కు అభ్యర్థిత్వం

★ ప్రజాదరణే తన బలమంటున్న పార్టీ శ్రేణులు

★ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

గుడిబండ మండలం ముత్తుకూరు గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మండల మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ముత్తుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
షబ్బీర్ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజాదరణ పొందారు. రాజకీయ ప్రస్థానంతో పాటు పత్రికా రంగం ద్వారా కూడా ప్రజలకు తనవంతు సేవలు అందిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు.
ఇప్పటివరకు ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న షబ్బీర్ తొలిసారిగా సర్పంచ్ ఎన్నికల రాజకీయ బరిలోకి దిగుతుండటంతో గ్రామంలో ఆయనకు మంచి స్పందన లభిస్తోంది. ప్రజల ఆశీస్సులు, అభిమానుల మద్దతుతో అత్యధిక మెజారిటీ సాధించి విజయం అందుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముత్తుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని మద్దనుకుంట, కేకే పాలెం, ముత్తుకూరు గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు షబ్బీర్‌కు అభినందనలు తెలియజేస్తూ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

గుడిబండ రిపోర్టర్ దేవరాజు