BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్

Select Suryaa Now
రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం..  నగర మేయర్ రమేష్ గౌడ్

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-అనంతపురం రూరల్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా  వైసీపీ మద్దతుతో పోటీ చేస్తున్న కొండేటి సునీతను గెలిపించుకుందామని నగర మేయర్ రమేష్ గౌడ్ సూచించారు. అనంతపురం రూరల్ వైసీపీ నేతలు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం నిర్వహించిన సమావేశానికి నగర మేయర్ రమేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమష్టిగా పనిచేసి సర్పంచ్ స్థానంతోపాటు వార్డు అభ్యర్థులను గెలిపించుకుందామని సూచించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభిరుద్ది ప్రజల మదిలో ఉందన్నారు. అదే సందర్భంలో రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వ వైఫల్యాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, మొన్నటి కార్పొరేషన్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మద్దతుగా నిలబడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి ఓటరును వ్యతిరేకంగా కలసి ఓట్లు అభ్యర్తించాలని గెలుపే లక్షంగా ముందుకు పోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నాయకులు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో వైసీపీ ఎస్టి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు ఎద్దుల అమర్ నాథ్ రెడ్డి,నగర అధ్యక్షులు చింతా సోమశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహులు, వైసీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, కుంటిమద్ది రమేష్, హరి, మహేష్, నాగార్జున రెడ్డి, చింతకుంట మధు, బెస్త వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్