శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష స్వాములకు నిత్యాన్నదానం.
చీమకుర్తి, మేజర్‌న్యూస్ :
చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్షా స్వాములకు ఏటా ఆనవాయితీగా జరుగు నిత్యాన్న దానం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు శ్రీ హరిహర క్షేత్రం ప్రతి నిధులు ఒక ప్రకటనలో తెలియచేసారు. పవిత్ర కార్తీకమాసం సందర్భంగా క్షేత్రంలో శుక్రవారం ఉదయం మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, అలంకారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం.9 గంటలకు హరిహర సుత అయ్యప్పస్వామి వారికి గంగ పూజ, పంచామృత, అభిషేకాలు తో పాటు కలశ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. శిద్దా వెంకటేశ్వర్లు శ్రీమతి వెంకట సుబ్బమ్మ గార్ల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న నిత్యాన్న దానం కార్యక్రమాన్ని మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, వారి కుటుంబ సభ్యులు ప్రారంభిస్తారని ఆలయ ప్రతినిధులు తెలిపారు శ్రీ అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ట,అభిషేకం,మహా పడి పూజ, నిత్యాన్నదాన పధకంలో సర్వ దీక్షా స్వాములు పాల్గొని భిక్ష స్వీకరించి శ్రీ అయ్యప్పస్వామి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రతినిధులు సర్వ దీక్షా స్వాములను కోరారు.