నామినేషన్ల వేళ వేములలో వైసిపి మద్దతుదారులపై రాజకీయ దాడులు... స్కార్పియో వాహనం ధ్వంసం
వేముల మేజర్ న్యూస్:
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేళ వేముల మండలంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ల స్వీకరణ కోసం మండలంలో నాలుగు క్లస్టర్లను ఏర్పాటు చేయగా, వేముల, చాగలేరు క్లస్టర్లలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుల అభ్యర్థులు, కార్యకర్తలకు టీడీపీ శ్రేణులు,పులివెందుల డి ఎస్ పి మురళి నాయక్ ఆద్వర్యం లో పోలీసులు అడ్డంకులు సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలు, రాళ్ల దాడుల్లో పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడగా, ఓ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి.వేముల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాకే గంగులయ్య (నాగప్ప), షేక్ మాలిక్ భాష నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జరిపిన రాళ్ల దాడిలో సాకే గంగులయ్య తలకు రాయి తగిలి గాయాలయ్యాయి. షేక్ మాలిక్ భాష తల పైభాగంలో బండరాయి తగలడంతో తలకు తీవ్ర గాయమైందని వైసీపీ వర్గీయులు తెలిపారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిపై దాడులు జరగడం స్థానికంగా కలకలం రేపింది.చాగలేరు క్లస్టర్ పరిధిలోని కొండ్రెడ్డిపల్లి, నారేపల్లి గ్రామాలకు చెందిన ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు గాయాలపాలయ్యారు. కొండ్రెడ్డిపల్లికి చెందిన వర్ర రాంమోహన్ రెడ్డి, వర్ర లక్ష్మిరెడ్డి, నారేపల్లికి చెందిన కల్లూరు వీరారెడ్డి, కల్లూరు రాజ ఓబుల్ రెడ్డిలకు గాయాలైనట్లు వైసీపీ వర్గీయులు వెల్లడించారు. ఘర్షణలో వర్ర లక్ష్మిరెడ్డికి చెందిన స్కార్పియో వాహనంపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.వేముల, చాగలేరు క్లస్టర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేకపోయారని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు పంపించాలని, వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పోలీసులను పలుమార్లు వేడుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ విజ్ఞప్తులకు స్పందన లభించలేదని, అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన తమ పార్టీ అభ్యర్థుల కు అడ్డంకులు సృష్టించి, దాడుల కారణంగా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. చివరకు నామినేషన్లు దాఖలు చేయకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.ఈ ఘటనలపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.బుధవారం ఉదయం వేముల మండలం వేముల,గొందిపల్లి,వి.కొత్తపల్లి,పెండ్లూరు,మబ్బు చింతలపల్లి అభ్యర్థులు నామినేషన్ కి వెళ్తుండగా పోలీస్ సిబ్బంది అడ్డుకోవడం జరిగింది.కాసేపటికి అక్కడికి చేరుకున్న పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ అభ్యర్థులతో మాట్లాడుతూ చివరకి వారిని నిలువరించలేక చేతులు ఎత్తేయడం తో కాసేపటికే అక్కడనుంచి వచ్చిన టీడీపీ వర్గాల వాళ్ళు గొడవ చేయడం రాళ్ళు విసరడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఎటువంటి నివారణ చర్యలు తీసుకోక పోవడంతో పలువురు వైఎస్ఆర్సీపీ మద్దతు దారులపై దాడులు జరగడంతో తీవ్ర గాయాల పలు అయ్యారు. పోలీసులు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం కాకుండా ఒక విధంగా అధికార పార్టీ వారికీ గొడవ కి మద్దతు పలికినట్లు అయింది ఇప్పటికైనా పై అధికారులు చొరవ తీసుకొని ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.
చల్లా సునీల్ వేముల రిపోర్టర్ కడప జిల్లా