సిబ్బంది తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి - కమిషనర్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :
నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా శానిటేషన్ విభాగంతో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో బుధవారం సమీక్షను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కమీషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు అనుసంధానం చేయని ట్రేడ్ లైసెన్స్ లను వార్డుల వారీగా అనుసంధానించే కార్యక్రమం త్వరగా పూర్తి చేయలని సిబ్బందినీ ఆదేశించారు. డ్రైను కాలువలలో పూడికతీత పనులను , పూడిక తీసిన చెత్త తొలగింపు చర్యలు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్రతిరోజు వారి వారి వార్డులకు సంబంధించిన వర్కర్ల అటెండెన్స్ ను ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సిబ్బంది అందరూ కచ్చితంగా యూనిఫామ్ ధరించి విధులకు హాజరు అయ్యేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్ప్రేయింగ్, ఫాగింగ్ చర్యలను ప్రతిరోజు నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఉద్దేశించి కమిషనర్ ఆదేశించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, కాలువలలో స్ప్రేయింగ్, ఫాగింగ్ చర్యలను చేపట్టాలని, డ్రైను కాలువలలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించే కార్యక్రమం చేపట్టాలని సిబ్బందిని ఉద్దేశించి ఆదేశించారు.
నగరవ్యాప్తంగా ఉన్న బ్లాక్ స్పాట్ ను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులను చేపట్టి పరిశుభ్రంగా ప్రాంతాలను తీర్చిదిద్ది వ్యర్ధాలను తిరిగి వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, మలేరియా విభాగం డాక్టర్ జిజియా, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.