స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల ఒకటవ శిక్షణ కార్యక్రమం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు 2026 కోసం నెల్లూరు డివిజన్లో నియమితులైన స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల ఒకటవ శిక్షణ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు విడతలుగా 253 మంది స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు మరియు మండల స్థాయి ట్రైనింగ్ ఇచ్చే అధికారులకు,11 మండలములైన వెంకటాచలం,మనుబోలు,ముత్తుకూరు, పొదలకూరు,తోటపల్లి గూడూరు, కోవూరు,బుచ్చి,ఇందుకూరుపేట,నెల్లూరు రూరల్ మండలం,రాపూరు,సైదాపురం ఎంపీడీవోలకు,డిప్యూటీ ఎంపీడీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమం ముఖ్య అతిథులుగా నెల్లూరు డివిజన్ ఎన్నికల ఇంచార్జ్ అధికారి డి వసుమతి , నెల్లూరు డి డి ఓ స్వరూప్ హాజరైనారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాస్థాయి శిక్షణ మాస్టర్లు అయిన కనకరాజు,రజనీకర్ ,శైలజ శిక్షణ ఇచ్చారు .ఈ శిక్షణా కార్యక్రమానికి కన్వీనర్ గా నెల్లూరు డివిజనల్ పంచాయతీ అధికారి అయిన డాక్టర్ పుట్టా రమణయ్య వ్యవహరించారు.