BREAKING
ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది ఇటలీ పార్లమెంట్‌లో తీవ్ర దుమారం ‘వారణాసి’ విడుదల వాయిదాపై జోరుగా ప్రచారం.. జక్కన్న సినిమా విషయంలో అసలు నిజమేంటి? ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం యెమెన్‌లో సౌదీ అరేబియా సైనిక చర్యలు అమెరికా అధ్యక్షుడితో మెక్సికో అధినేత్రి క్లాడియా షీన్‌బామ్ కీలక భేటీ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల ఒకటవ శిక్షణ కార్యక్రమం ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం.. హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయం వెనుక అసలు కారణం ఇదేనా? ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు ఎంఎస్ ధోని ఐపీఎల్ నిష్క్రమణపై సెలబ్రిటీల భావోద్వేగ స్పందన.. ఇకపై ఆట పూర్వలా ఉండదన్న ప్రముఖులు ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి.

జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు

Select Suryaa Now
జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు

​కావలి, మేజర్ న్యూస్ :   కావలి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు బుధవారం కావలి పీఏపీసీ (PAPC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.డి. దివాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముసునూరు ప్రాంత యువతతో కలిసి దివాకర్‌ను కలిసిన శ్రీహరి నాయుడు ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో తనకు జరిగిన అన్యాయాన్ని క్షుణ్ణంగా వివరించారు.  ​గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం, రైతుల పక్షాన నిలబడి తాను శాయశక్తులా కృషి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీహరి నాయుడు గుర్తుచేశారు. అనివార్య పరిస్థితుల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందని పేర్కొంటూ, ఈ ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు అందించాలని జి.డి.డి దివాకర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ముసునూరుకు చెందిన పలువురు యువకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.