పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ఉదయగిరి, మేజర్ న్యూస్ : ఉయగిరి సర్కిల్ పరిధిలో జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కావలి డీఎస్సీ వీవీ రమణకు మార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి, సీతారామపురం మండలాలకు ఒక డీఎస్పీ, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలకు మరో డీఎస్పీతోపాటు ప్రతి మండలానికి ఇద్దరు సీఐలు, ఐదు మంది ఎస్ఐలు, పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్చందంగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. ఎన్నికల కమీషన్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గంగుల సుభాషిణి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.