రాష్ట్ర స్కేటింగ్‌లో కర్నూలుకు పతకాలు
స్కేటింగ్‌లో జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకాంక్షించారు.
నవంబర్ 9 నుంచి 15 వరకు కాకినాడలోని వైఎస్సార్ స్కేటింగ్ రింక్‌లో జరిగిన 38వ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో కర్నూలు జిల్లాకు చెందిన ఎస్.ఎం.డి. ఇర్ఫాన్ పురుషుల విభాగంలో రింక్ రేస్‌లో కాంస్య పతకం, రోడ్ రేస్‌లో రజత పతకం సాధించాడు.15 సంవత్సరాల బాలికల విభాగంలో భవిష్య తేజ రోడ్ రేస్‌లో రజత పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది.
ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. సిరి క్రీడాకారులకు పతకాలు వేసి సత్కరించారు. జాతీయ స్థాయిలో జిల్లాకు మరిన్ని పతకాలు తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి భూపతిరావు, జిల్లా స్కేటింగ్ సంఘం సంయుక్త కార్యదర్శి స్రవంతి, జిల్లా అదనపు కార్యదర్శి అన్నం పునీత్ చౌదరి, సీఈవో పి. సునీల్ కుమార్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.