రాప్తాడు కేసు నిందితుడుకి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స – వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్
కర్నూలు:
అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన బాలిక హత్య కేసుకు సంబంధించి చికిత్స నిమిత్తం వచ్చిన వ్యక్తికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం జరిగింది.
సదరు వ్యక్తి 13-11-2026వ తేదీ రాత్రి 11:51 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో పాటు, కుడి కాలును మోకాలి పైభాగం వరకు తొలగించిన అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే సమస్య (Acute Pulmonary Thromboembolism) ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కార్డియాలజీ విభాగానికి తరలించి చికిత్స అందించారు.
కార్డియాలజీ వైద్య బృందం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, యాంటీకోగ్యులేషన్ చికిత్సతో పాటు ఇతర వైద్య సేవలు అందిస్తూ రోగి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించింది.
చికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో 18-11-2026వ తేదీన వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ సమయంలో మూడు నెలల పాటు వైద్యులు సూచించిన మందులను వైద్యుల సూచనల ప్రకారం వాడాలని, తదుపరి వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగంలో ఫాలోఅప్‌కు హాజరుకావాలని సూచించడం జరిగింది.
ఈ వైద్య సేవలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగం వైద్య బృందం అందించింది.
–ఇట్లు, డా. వెంకటేశ్వర్లు, అడిషనల్ డీఎంఈ& ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలు.