తెలంగాణ రైతుమేళాలో బతుకమ్మలతో సందడి చేసిన చందనవెల్లి సర్పంచ్
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 09)
హకీంపేటలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతుమేళాలో చందనవెల్లి గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి మహిళలతో కలిసి బతుకమ్మలతో పాల్గొని సందడి చేశారు. రైతుమేళా వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళా రైతులు బతుకమ్మలను తీసుకొని వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా సర్పంచ్ నవనీత స్వామి మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. వ్యవసాయానికి, మహిళా రైతులకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన రైతుమేళాలో తెలంగాణ పండుగలు, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కల్పించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రైతుమేళాలో బతుకమ్మలతో పాల్గొనడం ద్వారా తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో చందనవెల్లి గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామితో పాటు వార్డు సభ్యులు మీరంపల్లి వెంకటేష్, గుర్రం రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.