సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు చంపాపేట ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు నిఘా పెట్టారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.