పెదకాకాని దేవస్థానంఈవోగా పి. శ్రీనివాసులు రెడ్డి బాధ్యతలు స్వీకరణ.
పెదకాకని న్యూస్ : పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన నూతన కార్యనిర్వహణ అధికారిగా పి. శ్రీనివాసులు రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈవోగా పనిచే స్తున్న గోగినేని లీలాకుమార్ 2 మాసములు వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడంతో, దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవదాయ శాఖ ఉప కమిషనర్ పి. శ్రీనివాసులు రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునిప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చ కులు వేద పండితులు ఆశీర్వచనం చేశారు.