శేరిలింగంపల్లి ప్రజలకు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ దీపావళి శుభాకాంక్షలు
హఫీజ్ పెట్ ,మేజర్ న్యూస్ : దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవ శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని విప్ గాంధీ అన్నారు.తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.