రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం
సూర్య బోథ్ ; తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనంతరం జరిగిందని తిరిగి పూనః సమీక్షించాలని మాల-మాల ఉపకులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ మండల తాహసిల్దార్ వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలోని సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత గణాంకాలను పరిగణనలోకి తీసుకొని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రోస్టర్ కేటాయింపులు చేపట్టాలి. ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రోస్టర్ విధానంలో ఎస్సీ గ్రూప్ -3 వారికి 20 లోపు ఒక రోస్టర్ పాయింట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కుచులాపూర్ గ్రామ సర్పంచ్ మైలి నారాయణ, పసుల చంటి, కంది ప్రవీణ్, కురుమే గంగాధర్, కోల ప్రశాంత్, నాగార్జున, సాగర్, కుర్మే జానీ, తదితరులు పాల్గొన్నారు*