telangana
రోడ్డు ప్రమాదానికి గురైన వార్తా విలేకరి మంగలి నరసింహులును పరామర్శించి ఆర్థిక సాయం అందించిన డాక్టర్ ఏ. చంద్రప్రియ
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్:మోమిన్‌పేట్ మండల పరిధిలోని వెల్‌చాల్ గ్రామానికి చెందిన వార్తా విలేకరి మంగలి నరసింహులు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏ. చంద్రప్రియ శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా నరసింహులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం మన చంద్ర ఫౌండేషన్ తరఫున బాధిత విలేకరికి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ఏ. చంద్రప్రియ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం మానవీయ బాధ్యత అని పేర్కొన్నారు. అవసరంలో ఉన్నవారికి తమవంతు సహాయం అందించేందుకు మన చంద్ర ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనను స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడమే కాకుండా ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ ఏ. చంద్రప్రియకు మంగలి నరసింహులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవతా సేవలు అందిస్తున్న మన చంద్ర ఫౌండేషన్ సేవలను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, బుచ్చిరాములు, ఫౌండేషన్ సభ్యులు బుధారపు బుచ్చిరెడ్డి, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.