BREAKING
శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం సంఘ సభ్యుడి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత పెర్కంపల్లి హల్దీ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నేత విఠల్‌ రెడ్డి ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలలో సాఫ్ట్వేర్ కంపెనీకి 10 మంది విద్యార్థుల ఎంపిక ఉపాధి హామీ పనులకు కూలీలు క్రమం తప్పకుండా హాజరుకావాలి - ఎంపీడీఓ నాగేశ్ జాతీయ రహదారి పై ఇద్దరు యువకులు మృతి. భూ రికార్డులకు డిజిటల్ భద్రత.. వివాదాలకు శాశ్వత పరిష్కారం! బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి : డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన ఉక్రెయిన్‌లో చిన్నారుల మరణాల సంఖ్య 2022 స్థాయికి చేరువ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో బీదా రవిచంద్ర మర్యాదపూర్వక భేటీ

కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం.

Select Suryaa Now
కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ  విస్తృత ప్రచారం.

​కావలి, మేజర్ న్యూస్ :    కావలి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాలడుగు పద్మశ్రీ ఆధ్వర్యంలో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి వార్డు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి పాలడుగు పద్మశ్రీకి  బ్రహ్మరథం పట్టడం ప్రచారంలో ప్రత్యేక విశేషంగా నిలిచింది.
​ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి గడపకూ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి పాలడుగు పద్మశ్రీ  మాట్లాడుతూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. కావలి పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఎమ్మెల్యే నిరంతరం ప్రత్యేక కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన బాటలోనే నడుస్తూ, 13వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి, వార్డును అన్ని విధాలా ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టమైన హామీ ఇచ్చారు.  ​తాను ఎల్లప్పుడూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పాలడుగు పద్మశ్రీ ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో 13వ వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలడు పద్మశ్రీకి  తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.