కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో బీదా రవిచంద్ర మర్యాదపూర్వక భేటీ
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా పలకరించుకుని పలు రాజకీయ అంశాలపై చర్చించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. రాజకీయంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు నేతల సమావేశం నెల్లూరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించింది.