ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలలో సాఫ్ట్వేర్ కంపెనీకి 10 మంది విద్యార్థుల ఎంపిక
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు పట్టణంలోని ఎం.వి.ఆర్ డిగ్రీ కళశాలలో శుక్రవారం జరిగిన ప్రాంగాణ ఎంపికలలో బెంగలూరుకు చెందిన "డిజిటైడ్ " అనే కంపెనీకి 10 మంది విద్యార్థుల ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ ఎం వి ఆర్ రెడ్డి, హెచ్.ఆర్ మేనేజర్ సుమిత్ కుమార్ ఝాతెలిపారు. ఎంపికైన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాదులలోని బ్రాంచ్ ఆఫీస్ల నందు' రిపోర్ట్ చేయాలని, ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనంగా 2.5 లక్షల నుంది 3. లక్షల వరకు అందుకోనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీసుధ, కరస్పాండెంట్ ఎం వి ఆర్ రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్