సూర్య తిమ్మాపూర్ : పోరండ్లకు చెందిన ఆదర్శ పురుషుల పొదుపు సంఘం సభ్యుడు బొజ్జ రాజ్‌కుమార్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన కుటుంబానికి శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.2 లక్షల బీమా పరిహారం అందజేశారు. మృతుడి నామిని, తల్లి బొజ్జ శివవ్వకు ఈ మొత్తాన్ని శ్రీ రాజరాజేశ్వర పురుషుల పొదుపు సహకార సమితి పోరండ్ల అధ్యక్షుడు పెంచాల రంగయ్య, సంఘ అధ్యక్షుడు పల్లె అంజయ్య, ఉపాధ్యక్షుడు సదిరే సంపత్ తదితరుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నీలం సుదర్శన్, బొజ్జ ఐలయ్య, వెల్ది కనకయ్య, బొజ్జ రాజమౌళి, గడ్డం శ్రీకాంత్, మమిడిపల్లి శ్రీను, ఆరెల్లి వెంకటేష్, నాగపురి శ్రీనివాస్, నాగపురి మహేష్, నీలం రాజ్‌కుమార్, నూనె వెంకటేష్ (గణకులు), కొలిపాక సారయ్య (సమితి గణకులు) పాల్గొన్నారు.