బీద రవిచంద్రను కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్
నెల్లూరు, మేజర్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లోని ఆయన నివాసంలో నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీద రవిచంద్రకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇరువురు నేతలు ఆత్మీయంగా పలకరించుకుని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.