02 సూర్య తిర్యాణి : తిర్యాణి మండలం మందగూడ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఎంపీడీఓ నాగేశ్ శుక్రవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలందరూ పనులకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. గ్రామంలో అందుబాటులో ఉన్న ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా లభించే పని గ్రామీణ కుటుంబాలకు ఆదాయపరంగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీల భాగస్వామ్యం పెరగాలని, పనులకు హాజరయ్యే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎంపీడీఓ సూచించారు. కార్యక్రమంలో మందగూడ సర్పంచ్ తుమ్రం గోపాల్, పంచాయతీ కార్యదర్శి, టీఏ, ఎఫ్‌ఏ, గ్రామస్తులు పాల్గొన్నారు.