గౌరసంద్ర మారెమ్మకు వెండి కిరీటం బహుకరణ!
బెలుగుప్ప మేజర్ న్యూస్:
బెలుగుప్ప గ్రామంలో వెలిసిన శ్రీ గౌరసంద్ర మారెమ్మ అమ్మవారికి శ్రీనివాస విద్యానికేతన్ కరస్పాండెంట్ వెండి కిరీటాన్ని బహుకరించారు. శ్రీ గౌరుసంద్రమారెమ్మ అమ్మవారికి శుక్రవారం శ్రీనివాస విద్యా నికేతన్ కరస్పాండెంట్ శ్రీనివాసులు, ఆయన భార్య సుమ దంపతులు 500 గ్రాముల వెండితో తయారుచేసిన వెండి కిరీటాన్లు (దాదాపు లక్ష రూపాయలు విలువ) అమ్మవారికి బహుకరించారు. ఈ కిరటాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు,ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి నూతన వెండి కిరీటాన్ని అలంకరించారు. వెండి కిరీటంతో అమ్మవారు దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు,అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు దంపతులను అభినందించారు,ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, గ్రామస్తులు గోవిందరాజులు, వెంకటరమణ, భక్తులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి: జయశంకర్ బెలుగుప్ప మండల రిపోర్టర్