జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు గ్రంధాలయంలో నవంబర్ 14 నుండి నవంబర్ 20వ తేదీవరకు బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, విద్యార్థులకు వ్యాసరచన ,వకృతపు పోటీలు ,చిత్రలేఖనం, రంగేళి, ఇందిరాగాంధీ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నార్త్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పూర్ణచంద్ర మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వెళ్లాలని తెలియజేశారు, అనంతరం గ్రంథాల అధికారి హేమ్ కుమార్ మాట్లాడుతూ... గ్రంథాలయా లు విజ్ఞాన భాండాగారాలని ప్రతి ఒక్కరూ గ్రంథాలయం నుండి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని తెలిపారు. వివిధ పోటీలలో పాల్గొనిన విజేతలు చిత్రలేఖనం భావన, జైద్, మోక్షిత. వ్యాసరచన రాజేశ్వరి, ప్రసన్న, అభినయ. రంగేళి లాస్య , చైత్ర, రష్మిక . వ్యాసరచన అఖిల్, లాస్య ప్రియ, శరత్, గౌతమ్ నంద మొదలగు విద్యార్థులు విజయతలకు నిలిచారు. వారికి ప్రధానోపాధ్యాయులు పూర్ణచంద్ర చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతుల ప్రధానం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగా బాయ్, అంబిక ,విజయ, సామాజిక సేవాకర్త మధు మోహన్ రావు పాల్గొన్నారు.
అనిల్ కుమార్ యాదవ్