BREAKING
ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం.. కోలాహలంగా సాగిన మీరావలి నామినేషన్ ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ నామినేషన్లు! ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు ఎల్ నినో ప్రభావం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలు, నూనెగింజల సాగుకు రైతులు మొగ్గు చూపాలి విద్యార్థులకు బహుమతులు అందజేత నడికుడి -శ్రీకాళహస్తి రైలు మార్గం పురోగతి సాధించేనా...ఈ తరం వారు రైలు కూత వినేనా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావు ఉండకూడదు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్విజ్ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరం పరిశీలన – డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు  సుభాన్ నగర్ ఎస్టీ కాలనీలో సంయుక్త కుష్టు వ్యాధి సర్వే మరియు ఆరోగ్య పరీక్షల శిబిరం

ఇందిరమ్మ ఇల్లు అంటే ఆత్మగౌరవానికి చిరునామా - వొడితల ప్రణవ్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇల్లు అంటే ఆత్మగౌరవానికి చిరునామా - వొడితల ప్రణవ్
సూర్య జమ్మికుంట : ఎన్నో ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న సొంతింటి కల నేడు నిజమైంది. కొత్త ఇంటి గడపలో అడుగుపెడుతున్న లబ్ధిదారుల ముఖాల్లో ఆనందానికి అవధులు లేవు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ పరిధి, ఇల్లందకుంట మండల కేంద్రం, లక్ష్మాజిపల్లి గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, నూతన ఇంటికి ముగ్గుపోసే కార్యక్రమాలు సందడిగా సాగాయి.ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నేళ్ల నుంచో సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉండేదని, ఆ కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రణవ్ నెరవేర్చారని అన్నారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఇల్లు కట్టుకోవాలనే వారి కలను నెరవేరుస్తున్నామని అన్నారు. ఇల్లు ఆత్మగౌరవానికి ప్రతీక అని, అలాంటి ఇంటి కలను ఇందిరమ్మ ఇంటి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, సర్పంచులు, జమ్మికుంట పట్టణ నాయకులు, ఇల్లందకుంట మండల నాయకులు, మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.