BREAKING
శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ఇద్దరు స్నేహితులు.. ఒకే వేదికపై ఆత్మీయ పలకరింపు! ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం అంబేద్కర్ ను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు అంటే ఆత్మగౌరవానికి చిరునామా - వొడితల ప్రణవ్ పేపాల్ నూతన సీఎఫ్ఓగా క్లైర్ బ్రామ్లీ నియామకం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం

దేపూరు లో ఘనంగా సీత సమేత శ్రీకోదండరామ స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవం

Select Suryaa Now
దేపూరు లో ఘనంగా  సీత సమేత శ్రీకోదండరామ స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వెలసి ఉన్న  శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి  దేవస్థానంలో శుక్రవారం స్వామి అమ్మవార్ల కళ్యాణఉత్సవం ఘనంగా నిర్వహించారు. అద్భుతంగా నిర్మించిన ఈ దేవాలయం మొదటి ఏడాది ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జరిగిన ఈ ఉత్సవ వేడుకల్లో  గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా భారీగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తితో పూజించి భక్తులు వారి కోరికలు కోరుకున్నారు.మొదటి మరియు రెండవ రోజు ప్రత్యేక హోమాలు ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో గ్రామ సుభిక్షం కొరకు గ్రామం చుట్టూ గమిడరాళ్ల ఏర్పాటు చేశారు. చివరి రోజు నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా గ్రామానికి చెందిన దూర ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులు కూడా గ్రామానికి రావడం ప్రత్యేకత సంతరించుకుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు  కే. శ్రీనివాసులు నాయుడు, సిద్ధవటం.రమణారెడ్డి, ముక్కముళ్ళ. భాస్కర్ రెడ్డి, చిత్త బత్తిన.కొండయ్య, తదితరులు గ్రామస్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు.. ఇక్కడి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం, ఈ కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కమిటీ నిర్వాహకుల్లో ఒకరైన శ్రీనివాసులు నాయుడు ఇతర భక్తులు తెలిపారు.