ఆత్మకూరు జడ్పిటిసి మెంబర్ డాక్టర్ తూమాటి ప్రమాణ స్వీకారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులుగా ఇటీవల విజయం సాధించిన డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి శుక్రవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా ఆత్మకూరు మండల జడ్పిటిసి స్థానానికి డాక్టర్ శశిధర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్ల ఆధ్వర్యంలో డాక్టర్ శశిధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం గావించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, ఆయన మిత్రబృందం ప్రత్యేక అభినందనలు తెలిపారు.