telangana
ఆదివాసీల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు - ఐటీడీఏ పీవో మంద మకరందు
సూర్య, జన్నారం : ఆదివాసీల సమస్యలను గుర్తించి నిబంధనల మేరకు దశలవారీగా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ఐటిడిఏ పిఓ మంద మకరందు అన్నారు. శుక్రవారం జన్నారం మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధిలో గల కోలాంగూడ, రాయకుంట గ్రామాల్లో ఆదివాసీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంద మకరందు మాట్లాడుతూ పైన పేర్కొన్న రెండు కల్వర్టుల నిర్మాణాలకు లక్షణాలు రూపొందించి త్వరలోనే పనులు చేపట్టేటట్లు చూస్తానని అన్నారు. ఆదివాసీలకు గ్రామంలోనే రేషన్ బియ్యం పంపిణీ చేసేలా చూడాలని తహసిల్దార్ బక్కయ్యను ఆదేశించారు. అంతకు ముందు సర్పంచ్ దినేష్ పవార్ ఆధ్వర్యంలో ఆదివాసీలు డప్పుల చప్పుళ్ళ మధ్య పిఓ మంద మకరందుపై బంతి పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామ పెద్దలు శాలువాతో సన్మానించారు.ప్రత్యేకంగా ప్రధానమంత్రి జన్మన్ పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల కింద అర్హులైన కుటుంబాలకు ఇల్లు మంజూరయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎమ్మార్వో బక్కయ్య, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ వెంకటేష్, హౌసింగ్ జేఈ చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ బ్రదర్ వర్మ, ఈజీఎస్ ఏపివో రవీందర్, జిపిఓ సంతోషిమాత, కార్యదర్శి భీమ్రావు, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ రావు, ఆదిమ గిరిజన కోలాం మండలాధ్యక్షులు సోనేరావు, గ్రామ పెద్దలు ఉన్నారు.