telangana
స్వాతి పాలిక్లినిక్ ఫెర్టీలిటీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రం లోని సిరిసిల్ల రోడ్డు లో స్వాతి పాలిక్లినిక్ ఫెర్టీలిటీ సెంటర్ ను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి శ్రీనివాస్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డాక్టర్ స్వాతి రెడ్డి మోతె పాలిక్లినిక్ సెంటర్ ద్వారా ప్రజలకు సమాజం లో మెరుగైన సేవలు అందించాలని కోరారు. సమాజం లో డాక్టర్ వృత్తి అనేది దేవుళ్ళ తో సమానమని అలాంటి వృత్తి ని ఎంచుకొని స్వాతి రెడ్డి సమాజం కోసం వైద్య వృత్తి ని ఎన్నుకోవడం సంతోష కరమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కాటిపల్లి రమణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కౌన్సిలర్ల ను సన్మానించారు. ఈ కార్యక్రమం లో సురేందర్ రెడ్డి, సుజిత భరత్, మొటూరి శ్రీకాంత్, యాడరం ప్రియాంక, కాసార్ల శ్రీనివాస్, కళ్లెం సత్యం,భాను, నిట్టు గంగాధర్, వాజిత్, యూనిస్, అరవింద్, మధు కృష్ణ లతో పాటు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.