BREAKING
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు పై రివ్యూ మీటింగ్:" బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి – బోరేగావ్ సర్పంచ్ నగేందర్ పాటిల్ పీహెచ్‌డీ వైవా విజయవంతంగా పూర్తి చేసిన తిరుమల రూపేష్ భక్తిపారవశ్యంలో కోటి దీపోత్సవం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కూటమి బలపరిచిన కోవూరు సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబు పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు!

భవిష్యత్తు రవాణా ఎలక్ట్రిక్ వాహనాలదే! నేషనల్ హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Select Suryaa Now
భవిష్యత్తు రవాణా ఎలక్ట్రిక్ వాహనాలదే!  నేషనల్ హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కొండాపూర్ ;  భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మరింత ప్రాధాన్యత పెరుగుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు పట్లోళ్ల నిర్మల మల్లేశం నేషనల్ హైవే పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, ఈ దిశగా మల్లేశం ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. యువత చదువుతో ఉన్నత స్థానాలకు ఎదగడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి, వ్యాపార రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి మరికొందరికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ఎలక్ట్రిక్ వాహనదారులకు ప్రయాణ మార్గంలో ఛార్జింగ్ సదుపాయం అందుబాటులోకి రావడంతో పాటు పర్యావరణహిత రవాణాకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. స్టేషన్ ఏర్పాటు చేసిన పట్లోళ్ల మల్లేశం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశం కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, స్నేహితులు పాల్గొన్నారు.