అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు.. రెండు ట్రాక్టర్లు పట్టివేత
యాలాల మేజర్ న్యూస్: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకుని కేసులు నమోదు చేశారు.శుక్రవారం ఉదయం లక్ష్మీనారాయణపూర్,సంగెం ఖుర్దు గ్రామాల పరిధిలో తనిఖీలు నిర్వహించగా, అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి.అగ్గనూర్ గ్రామానికి చెందిన బంటు నర్సింలు,సంగెం ఖుర్దు గ్రామానికి చెందిన మోత్కూరి రమేష్ నడుపుతున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విఠల్ రెడ్డి హెచ్చరించారు.