రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి, దోపిడీ పాలనతో ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఆ రెండు పార్టీల పాలనను తీవ్రంగా అసహ్యించుకుంటున్నారని, అందుకే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఒక కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ రెడ్డి, ప్రత్యర్థి పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాదిరిగా ప్రజలను మభ్యపెడుతూ 'మసిపూసి మారేడుకాయ' చేసి మాట్లాడే నేర్పు తమకు లేకపోవచ్చని, కానీ రాష్ట్రానికి నిజమైన సుపరిపాలన అందించే సత్తా తమ పార్టీకి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.