BREAKING
భారీగా పడిపోయిన బ్రిటన్ స్టాక్ మార్కెట్లు బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ గా పూషడపు రోహిణి ఏకగ్రీవం నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ లోక్‌సభ పునర్విభజనలో ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వాలి.. పాలస్తీనా అనుకూల అమెరికా మీడియా వారసుడికి స్పెయిన్ కోర్టు ఊరట రోడ్డు ప్రమాదానికి గురైన వార్తా విలేకరి మంగలి నరసింహులును పరామర్శించి ఆర్థిక సాయం అందించిన డాక్టర్ ఏ. చంద్రప్రియ అంగోలాలో చమురు రంగంలో భారీ పెట్టుబడి ప్రజల గుండెచప్పుడు ప్రజాదర్బార్: తూర్పు ఎమ్మెల్యే నసీర్ చీమకుర్తి హరిహర క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్పస్వామి కలశ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం Revolut డేటా లీక్ కలకలం.. కస్టమర్లపై దాడులకు కుట్రను భగ్నం చేసిన పోలీసులు! ప్రజాసేవలో మరో అడుగు.. హొళగుంద జడ్పిటిసి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈడిగ గోవింద్ గౌడ్ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్.. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆశీసులతో.. అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు.. రెండు ట్రాక్టర్లు పట్టివేత కోగిలి సర్పంచ్ బరిలో షేక్ రషీద్.. భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల్లోకి..అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న అనుచరులు

పాలిటెక్నిక్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

Select Suryaa Now
పాలిటెక్నిక్‌ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
సూర్య నస్పూర్ : సింగరేణి ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంతోపాటు, కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్సీసీఎల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ జనరల్‌ మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలోని సింగరేణి కాలరీస్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై విద్యా ప్రగతి, హాజరు, పరీక్ష ఫలితాలు, బోధనా ప్రమాణాలు, కళాశాలలోని వసతులపై సమీక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే తల్లిదండ్రులు, అధ్యాపకులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కళాశాలలో సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో మాట్లాడి సూచనలు చేసిన జీఎంకు కళాశాల ప్రిన్సిపాల్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ డినీల్‌ కుమార్‌, విభాగాధిపతులు కృతజ్ఞతలు తెలిపారు.