కోగిలి సర్పంచ్ బరిలో షేక్ రషీద్.. భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల్లోకి..అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామంటున్న అనుచరులు
చిట్టమూరు మేజర్ న్యూస్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్ కోగిలి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా తరలిరాగా,భారీ ర్యాలీగా చిట్టమూరు సచివాలయానికి చేరుకున్నారు.అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.కోగిలి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు ఉందని,స్థానిక రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.గతంలో కోగిలి ఎంపీటీసీ ఎన్నికల్లో కమతం చెంగయ్యను తిరుగులేని మెజారిటీతో గెలిపించుకోవడంలో కీలకంగా వ్యవహరించిన షేక్ రషీద్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవడంతో పంచాయతీలో రాజకీయ సందడి నెలకొంది.అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడిగా రషీద్ ఇప్పటికే స్థానికంగా గుర్తింపు పొందారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.పేదల సమస్యలపై స్పందిస్తూ, ప్రజలతో మమేకమై అందరి మన్ననలు పొందిన నాయకుడిగా ఆయనకు మంచి ఆదరణ ఉందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లోనూ ప్రజల మద్దతుతో అత్యధిక మెజారిటీ సాధించి విజయం సాధించడం ఖాయమని ఆయన అనుచరులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.భారీ సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి తరలిరావడం కోగిలి పంచాయతీలో షేక్ రషీద్ అభ్యర్థిత్వానికి పార్టీ శ్రేణుల నుంచి లభిస్తున్న మద్దతును చాటిచెప్పింది.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్