telangana
మండల టాపర్‌కు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
సూర్య తిర్యాణి : తిర్యాణి మండలంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల టాపర్‌కు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహక చెక్కును అందజేశారు. ఎంఈఓ అంజయ్య, నాయకపుగూడ సర్పంచ్ సుమలత శ్రీనివాస్, ఉపసర్పంచ్ పవన్, తిర్యాణి సర్పంచ్ రాజేష్, ఉపసర్పంచ్ చేని కుమార్ చేతుల మీదుగా చెక్కును అందించారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి మండలానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతిభ కనబరిచే విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయూత అందిస్తోందని, 2026–27 విద్యా సంవత్సరానికి కూడా రూ.2 కోట్ల ప్రైజ్ మనీ కార్యక్రమం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డివిజన్ మేనేజర్ గుండా రాజు, బ్రాంచ్ మేనేజర్ నూనె ప్రశాంత్, డీఓ బొద్దున లలిత, రమేష్‌తో పాటు పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.