BREAKING
ఆదివాసీల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు - ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రతి విధ్యార్దికి ఆరోగ్య అవగాహాన అవసరము : డా కరుణాకర్ కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. కావలిలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం సావిత్రమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి. డాక్టర్ తలారి రంగయ్య. ప్రభుత్వంలో విలీనంతో సమస్యలు..! -పొయ్యిలో పడ్డ ఆర్టీసీ ఉద్యోగులు..!! ఆత్మకూరు జడ్పిటిసి మెంబర్ డాక్టర్ తూమాటి ప్రమాణ స్వీకారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నెల్లూరు అభివృద్ధికి శ్రీకారం: మంత్రి నారాయణ. గౌరసంద్ర మారెమ్మకు వెండి కిరీటం బహుకరణ! నిరసనకారులు, జర్నలిస్టులపై దాడులు.. 61 ఘటనలను గుర్తించిన అమ్నెస్టీ! చిప్స్ లో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మానవత్వమే మతంగా పేదల కర్మకాండలకు "కంచి" 70,000ఆర్థిక సాయం లబ్దిదారులకు చేయÖత పెన్షన్ మంజూరు పత్రాల అందజేత దేపూరు లో ఘనంగా సీత సమేత శ్రీకోదండరామ స్వామి దేవస్థానం కళ్యాణ మహోత్సవం మదనపల్లెలో ఘనంగా టిప్పుసుల్తాన్ జయంతి : హాజరైన ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ ఎస్.కె బాషా

లోక్‌సభ పునర్విభజనలో ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వాలి..

Select Suryaa Now
లోక్‌సభ పునర్విభజనలో ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత ఇవ్వాలి..

హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో కేవలం జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదని, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం జనాభా ఆధారంగా 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ మీడియా కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్రాల జీడీపీ, జనాభా రెండింటినీ పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేపట్టాలని ఆయన సూచించారు.

దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నమూనాను ప్రస్తావిస్తూ.. ప్రతి పేదవాడి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వసించారని సీఎం గుర్తుచేశారు. నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యతనివ్వగా, పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను, మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ అభివృద్ధి నమూనా అని ఆయన వివరించారు.

రాష్ట్రాన్ని దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను రూపొందించామని, భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తామని సీఎం తెలిపారు. గడిచిన మూడేళ్లలో 65 శాతం కార్యక్రమాలను పూర్తి చేశామని, మిగిలిన వాటిని వచ్చే రెండేళ్లలో అమలు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.

విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలను వివరిస్తూ.. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో హాజరు శాతం పెరిగిందన్నారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తెచ్చే చర్యలు చేపట్టామని తెలిపారు. ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌షిప్‌లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయని వెల్లడించారు.

క్రీడారంగ అభివృద్ధిలో భాగంగా 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఇప్పటికే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చామని, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కూడా ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. మెస్సీ, డిగో మారడోనా తన అభిమాన క్రీడాకారులని రేవంత్ రెడ్డి తెలిపారు.