BREAKING
శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం సంఘ సభ్యుడి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత పెర్కంపల్లి హల్దీ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నేత విఠల్‌ రెడ్డి ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలలో సాఫ్ట్వేర్ కంపెనీకి 10 మంది విద్యార్థుల ఎంపిక ఉపాధి హామీ పనులకు కూలీలు క్రమం తప్పకుండా హాజరుకావాలి - ఎంపీడీఓ నాగేశ్ జాతీయ రహదారి పై ఇద్దరు యువకులు మృతి. భూ రికార్డులకు డిజిటల్ భద్రత.. వివాదాలకు శాశ్వత పరిష్కారం! బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి : డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన ఉక్రెయిన్‌లో చిన్నారుల మరణాల సంఖ్య 2022 స్థాయికి చేరువ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో బీదా రవిచంద్ర మర్యాదపూర్వక భేటీ

కావలిలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
కావలిలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

​కావలి, మేజర్ న్యూస్ :   నవంబరునెల 26న జరగనున్న కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
​ఈ ప్రచార కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని, అలాగే వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
​కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి సౌమ్యుడని, ఓర్పు, సహనం కలిగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. దివంగత మాజీ మంత్రి యానాదిరెడ్డికి ఎన్నో సంవత్సరాలుగా అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, కావలి పట్టణ ప్రజలకు శివకుమార్ రెడ్డి చిరపరిచితులని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వివరించారు. కావలి పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేసి ఆదరించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వివిధ వార్డుల్లో సాగుతున్న ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుండి స్పందన లభిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ​ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చీదెళ్ల కిషోర్, వల్లెపు కిషోర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ఓటర్లు పాల్గొన్నారు.