BREAKING
శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ఇద్దరు స్నేహితులు.. ఒకే వేదికపై ఆత్మీయ పలకరింపు! ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం అంబేద్కర్ ను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు అంటే ఆత్మగౌరవానికి చిరునామా - వొడితల ప్రణవ్ పేపాల్ నూతన సీఎఫ్ఓగా క్లైర్ బ్రామ్లీ నియామకం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం

మదనపల్లెలో ఘనంగా టిప్పుసుల్తాన్ జయంతి : హాజరైన ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ ఎస్.కె బాషా

Select Suryaa Now
మదనపల్లెలో ఘనంగా టిప్పుసుల్తాన్ జయంతి : హాజరైన ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ ఎస్.కె బాషా


మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లె పట్టణం,అగర్తవీధిలో ఉన్న ముస్లిం ఐక్యవేదిక కార్యాలయంలో టిప్పుసుల్తాన్ 277వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ సలహా దారులు డాక్టర్ ఎస్.కె. బాషా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఇందులో భాగంగా టిప్పు సుల్తాన్ చిత్రపటానికి నివాళులర్పించి,కేక్ కట్ చేసి ఐక్యవేదిక సభ్యులకు పంచిపెట్టారు.అనంతరం డాక్టర్ ఎస్.కె. బాషా మాట్లాడుతూ టిప్పు సుల్తాన్ చేసిన సేవలను,ఆయన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు.దేశ చరిత్రలో టిప్పు సుల్తాన్ పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. మత సామరస్యానికి,పరిపాలనా సంస్కరణలకు ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చారని,నేటి యువత టిప్పు సుల్తాన్ దేశభక్తిని,ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.మదన పల్లెలో టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్,టిప్పు సుల్తాన్ మజీద్ లు ఉన్నాయని,అలాగే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్య వేదిక మదనపల్లె నియో జకవర్గం జాయింట్ సెక్రటరీ అజ్మాత్ ఖాన్,అమీర్ సాహెబ్,అక్బర్,షేక్ షమీం,తాజ్ ఉన్నిసా,సబీనా,ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి