BREAKING
శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ఇద్దరు స్నేహితులు.. ఒకే వేదికపై ఆత్మీయ పలకరింపు! ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం అంబేద్కర్ ను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు అంటే ఆత్మగౌరవానికి చిరునామా - వొడితల ప్రణవ్ పేపాల్ నూతన సీఎఫ్ఓగా క్లైర్ బ్రామ్లీ నియామకం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం

ప్రభుత్వంలో విలీనంతో సమస్యలు..! -పొయ్యిలో పడ్డ ఆర్టీసీ ఉద్యోగులు..!!

Select Suryaa Now
ప్రభుత్వంలో విలీనంతో సమస్యలు..! -పొయ్యిలో పడ్డ ఆర్టీసీ ఉద్యోగులు..!!

తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్  :   ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని ప్రజా ర వాణాశాఖ (పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డి పార్ట్‌మెంట్‌) ఉద్యోగులుగా గత  వైసీపీ ప్రభుత్వంన విలీనం చేయ డంతో ఉద్యోగులు ఎంతో సంబర పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు ఎంతో మేలు కలుగుతుం దని భావించారు. అయితే  ఆశిం చింది జరగకపోగా అందుకు భి న్నంగా ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి "పెనంపై నుంచి పొయ్యిలో పడి న" చందంగా మారింది. ప్రభు త్వంలో విలీనంతో ఉద్యోగులు తమ సీనియరిటి కోల్పోవాల్సి వ చ్చింది. ఫలితంగా సర్వీసు నిబం ధనల ఉత్తర్వుల మేరకు వేల సంఖ్యలో ఉద్యోగులు పదోన్నతు లు పొందే అవకాశం లేకుండా పో యింది. దాంతో సీనియరిటీని కో ల్పోయిన దాదాపు 52 వేలమం ది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నె లకొంటోంది. ఇకపోతే ఆర్‌టి‌సిలో మామూలుగా 4 సంవత్సరాలకు ఒక సారి వేతన సవరణ (పేస్కే ల్) చేసే వాళ్ళు, 4 లేదా 5 నెల లు ఆలస్యంగా వేతన సవరణ చేసినా అరియర్స్ ఇచ్చే వాళ్ళు. అయితే ప్రభుత్వంలో విలీనంతో ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒక సారి పి‌ఆర్‌సి చేస్తున్నారు. అది కూడా సంవత్సరాల తరబడి ఆ లస్యమైన అడిగే నాధుడు కూడా లేకుండా పోయారని ఉద్యోగులు వాపోతున్నారు.  పైగా 2021, 2025 సంబంధించి 2 ఆర్పీలు కో ల్పోయామని, అంతేకాక ప్రభు త్వంలో కలిసిన తర్వాత 2022 లో 25 శాతం ఐ.ఆర్. 23 శాతని కి పడిపోయింది. గతంలో డి‌ఏలు పెండింగ్ లేకుండా కలిపే వాళ్ళు. ప్రభుత్వంలో విలీనంతో ఇప్పుడు గత మూడేళ్ళ నుండి రావలసిన డి‌ఏ ఊసే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. 
  స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్ఆర్బిఎస్) స్కీము ద్వారా ప్ర తి ఉద్యోగి నుండి నెలకు కొంత మొత్తాన్ని సభ్యత్వం క్రింద వసూ లు చేస్తారు. అలా 360 నెలలు నిండిన ఉద్యోగులకు ప్రతి నెలా రూ. 3,600 పెన్షన్ రూపంలో వ చ్చేది. అయితే ప్రభుత్వంలో విలీ నంతో అది కాస్త రద్దయింది. కా గా ప్రభుత్వంలో కలిస్తే అందరి లాగా బేసిక్ పేలో 50 శాతం పెన్ష న్ వస్తుందనుకొంటే, ఎస్ఆర్బిఎ స్  ద్వారా వచ్చే కొద్ది పెన్షన్ ను కూడా ఉద్యోగులు నోచుకోకుండా పోవడం విచారకరం. .అయితే ఇ టీవల సుప్రీం కోర్టు ఆదేశాల మే రకు హయ్యర్ పెన్షన్ కు సంబం ధించి అమౌంట్ ను ఉద్యోగి వ్యక్తి గతంగా కట్టుకున్న వారికి పెన్షన్ వసతి కలిగింది. అయితే 15 లక్ష ల రూపాయల వరకు కడితే 12 వేల నుండి 18 వేల రూపాయల వరకు పెన్షన్ వస్తుంది కానీ ఉ ద్యోగి మరణిస్తే భార్యకు కేవలం 50 శాతం మాత్రమే వస్తుంది.
 ఇక స్టాఫ్ బెనెవలెంట్ కమ్ త్రిఫ్ట్ స్కీమ్ (ఎస్బిటి) అంశాన్ని పరిశీ లిస్తే గతంలో ఎస్బిటి కోసం ప్రతి ఉద్యోగి నెలకు రూ. 100 చొప్పు న 360 నెలలు కడితే పదవీ విర మణ లేదా చనిపోయినా 1.5 ల క్షలు ఇచ్చేవాళ్లు, అయితే ప్రభు త్వంలో విలీనం దాన్ని రద్దు చే యడం జరిగింది. ఇప్పుడున్న  ఏ పీజీఎల్ఐ వలన ఉద్యోగులకు న ష్టం జరుగుతోంది. అంతేకాక గత 4 సంవత్సరాలు ట్రెజరీ లాగిన్ అయి గ్రీన్ చానెల్ లీవ్ ఎన్కా ష్మెంట్ కాస్త పెండింగ్ లో వుండి పోయింది. అలాగే గతంలో రిటైర్ అయినవారికి గ్రాడ్యుటీ చెల్లింపు కు సంబంధించి పరిమితి లేకుం డా చేల్లెంచే వారు, కానీ ఇప్పుడు 16 లక్షలు లిమిట్ పెట్టి ఆ పైన వ చ్చినా 16 లక్షలు మాత్రమే చెల్లి స్తున్నారు. 
     ఇకపోతే గతంలో  సర్వీస్ లో వున్న ప్రతి ఉద్యోగికి పరిమితి లే కుండా వైద్య వసతి కల్పించేవా రు, అయితే ప్రభుత్వంలో విలీ నంతో ఇప్పుడు ఈ‌హెచ్‌ఎస్ క్రిం ద  4 లక్షలు లిమిట్ పెట్టడం జరి గింది. గ్రాడ్యుటి గాని, లీవ్ ఎంకా ష్మెంట్ గాని గతంలో సకాలంలో చెల్లించే వారు, ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగి కి సెటిల్మెంట్ చె ల్లింపు కై సంవత్సర్రాల తరబడి వేచి  చూడాల్సిన దుస్థితి దాపు రించడమే కాకుండా ట్రెజరి కా ర్యాలయం చుట్టూ కాళ్ళు అరిగే లా తిరగాల్సిన పరిస్తితి నెలకొం ది. ఇకపోతే చనిపోయిన ఉద్యో గుల పిల్లల కారుణ్య నియామకా లు గతంలో సకాలంలో జరిగేవి, కానీ ప్రభుత్వంలో విలీనం తర్వా త  వివిధ కారణాలతో ఆఫీస్ ల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏదే మైనా తమ జీవితాలలో కొత్త వె లుగులు వస్తాయని ఆశించిన ఆ ర్టీసీ ఉద్యోగులు పరిస్థితి ప్రభు త్వంలో విలీనంతో అందుకు భి న్నంగా "పెనంపై నుంచి పొయ్యి లో పడ్డ" చందంగా మారడం అ త్యంత విచారకరం.