BREAKING
శాతవాహన వర్సిటీ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి - గుంజపడుగు హరిప్రసాద్ రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మృతులకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం ఇద్దరు స్నేహితులు.. ఒకే వేదికపై ఆత్మీయ పలకరింపు! ప్రతి పేదవాడికి ప్రమాద బీమా ఉండాలన్నదే లక్ష్యం అంబేద్కర్ ను నేటి తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు అంటే ఆత్మగౌరవానికి చిరునామా - వొడితల ప్రణవ్ పేపాల్ నూతన సీఎఫ్ఓగా క్లైర్ బ్రామ్లీ నియామకం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం

మానవత్వమే మతంగా పేదల కర్మకాండలకు "కంచి" 70,000ఆర్థిక సాయం

Select Suryaa Now
మానవత్వమే మతంగా పేదల కర్మకాండలకు "కంచి"  70,000ఆర్థిక సాయం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ : శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి  తన ఉదారతను చాటుకున్నారు. మున్సిపాలిటీకే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ఆత్మకూరు మండలంలోని రూరల్ గ్రామాలకు కూడా విస్తరించి, పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.శుక్రవారం ఇటీవల మృతి చెందిన 7 కుటుంబాలకు  10,000 చొప్పున70,000ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
గ్రామీణ ప్రాంతం లోని 
బసవరాజుపాలెం బీసీ కాలనీకి చెందిన గోపిదేశి పెంచలయ్య  కుటుంబాన్ని,
నల్లపురెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జువ్వది పెంచలయ్య కుటుంబాన్ని,
వాసిలి బీసీ కాలనీకి చెందిన మల్లె రాజు కుటుంబాన్ని,
వాసిలి ఎస్సీ కాలనీకి చెందిన చింతల బుజ్జమ్మ కుటుంబాన్ని,
మున్సిపాలిటీ పరిధిలోని  15 వ వార్డు మేదర వీధి ఎస్టీ కాలనీకి చెందిన రాగి లక్ష్మీదేవి కుటుంబాన్ని,
15 వ వార్డు మేదర వీధి ముస్లిం కుటుంబానికి చెందిన షేక్ షఫీ కుటుంబాన్ని, 24 వ వార్డు ఉలవదిబ్బలోని ఎస్సీ కుటుంబానికి చెందిన దాసరి నరసింహులు కుటుంబ సభ్యులను పరమేశ్వర రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. గత మూడు సంవత్సరాల నుంచి పట్టణ ప్రాంతానికే పరిమితమైన ఈ సేవను గ్రామాల్లోని పేదల కష్టాలను గుర్తించి మండల వ్యాప్తంగా 21 పంచాయితీల్లో అమలు చేస్తున్నారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు నిరంతర అన్నదాన కార్యక్రమం ద్వారా వేలమంది ఆకలి తీరుస్తున్నారు.కులమతాలకు అతీతంగా పేదరికమే ప్రాతిపదికగా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి గడపకు వెళ్లి పరామర్శిస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు.
"ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ తమ వారి అంత్యక్రియలకు ఇబ్బంది పడకూడదనేదే తన సంకల్పమని కంచి పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సాయం అందుకున్న కుటుంబాల వారంతా పరమేశ్వర రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 
శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మల్లవరపు జయేంద్రప్రసాద్ రెడ్డి, అచోలు నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.