బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ
సూర్య బెజ్జుర్ ; కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకము ప్రారంభమవుతుందని,ముందుగా బెజ్జూరు గ్రామపంచాయతీ పరిధిలోని రేషన్ కార్డుదారులు ఇట్టి జీవిత బీమా కి అర్హులు. ఇట్టి భీమా క్రింద రూపాయలు 5 లక్షల లబ్ది చేకూరుతుంది. భీమా కోసం ప్రతి లబ్ధిదారుని తరపున ప్రభుత్వంమే భీమా కంపెనీకి డబ్బులు చెల్లించబడుతుందని, లబ్ధిదారులు ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదని,తదుపరి గ్రామపంచాయతీలో కూడా విడుతల వారీగా ప్రారంభించబడతయని, 18 వ తారీకు డిసెంబర్ 2026 ఆఖరు తేదీ. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల రేషన్ కార్డు లబ్ధిదారులు ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. యజమాని తో పాటు ఒక్క రేషన్ కార్డు తీసుకువస్తే సరిపోతుందని,ఎటువంటి పేపర్, జిరాక్స్ కాపీలు అవసరం లేదని,మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీ కార్యదర్శి సంప్రదించి వివరాలు అక్కడే నమోదు చేసుకోవలసి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారికీ కుడా ఇట్టి భీమా సదుపాయము కలదు. వీరికి సంబందించిన వివరాలు త్వరలో వెల్లడిస్తాము ఒక ప్రకటన లో బండారి ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ, తెలిపారు . ఇట్టి కార్యక్రమంలో రామ్మోహన్ రావు, తహసీల్దార్,బెండారి మురళి,ఏ పి ఓ ,పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ,సీసీ లు పాల్గొన్నారని ఎంపీడీఓ తెలిపారు.