కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు... యువజన విభాగం నాయకులు చల్లా సునీల్ కుమార్
వేముల మేజర్ న్యూస్:::--- ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి.కోర్టు ఆదేశాల మేరకు వైకాపా మద్దతు కలిగిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు వెళ్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు,వైసీపీ నేత చల్లా సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ల కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ కాన్వాయ్‌ను అడ్డుకుని రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో ఓ వాహనం ధ్వంసమైనట్లు తెలిపారు.ఎంపీ అవినాష్ రెడ్డి ముందుగానే స్థానిక సి ఐ, ఎస్ ఐ లకు సమాచారం అందించిన కూడా ఇలాంటి దాడులు జరగడం వెనుక పోలీసు లు ఉన్నారేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు దిగడం, నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలిగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు..ఈ ప్రభుత్వం లో ఎంపీపై దాడి చెయ్యడానికి కూడా వెనకాడటం లేదు అని, సెక్యూరిటీ ఉన్న వ్యక్తిపై దాడికి కూడా తెగబడుతున్నారు అని,కూటమి పార్టీ వాళ్ళు ఎన్ని వ్యవస్థలను వాడుకొని విరుచుకుపడినా,ప్రాణాలకు తెగించి అయినా పోరాటం చేసేందుకు మా పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం అని,ఎంపీపై దాడిని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలి అని వారు అన్నారు.ఈ దాడి ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు తావులేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనను 'ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి'గా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని,
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన నిందితులపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చల్లా సునీల్ కుమార్ డిమాండ్ చేశారు
చల్లా సునీల్ కుమార్ వేముల రిపోర్టర్ కడప జిల్లా