BREAKING
శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం సంఘ సభ్యుడి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత పెర్కంపల్లి హల్దీ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నేత విఠల్‌ రెడ్డి ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలలో సాఫ్ట్వేర్ కంపెనీకి 10 మంది విద్యార్థుల ఎంపిక ఉపాధి హామీ పనులకు కూలీలు క్రమం తప్పకుండా హాజరుకావాలి - ఎంపీడీఓ నాగేశ్ జాతీయ రహదారి పై ఇద్దరు యువకులు మృతి. భూ రికార్డులకు డిజిటల్ భద్రత.. వివాదాలకు శాశ్వత పరిష్కారం! బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి : డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన ఉక్రెయిన్‌లో చిన్నారుల మరణాల సంఖ్య 2022 స్థాయికి చేరువ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో బీదా రవిచంద్ర మర్యాదపూర్వక భేటీ

కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల చింపివేతపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల చింపివేతపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
సూర్య ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్, లింగాపూర్, కడం పెద్దూర్, కొండుకూర్, లక్ష్మీపూర్, కల్లెడ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగలతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చింపివేయడంపై కడం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు గంగన్న మాట్లాడుతూ,ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతూ ప్రజలకు చేరువవుతోందని తెలిపారు. పార్టీ బలోపేతాన్ని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను ఓర్వలేక కొందరు ప్రతిపక్ష నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఫ్లెక్సీలను చింపివేయడం వంటి పనికిమాలిన చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మవిశ్వాసం తగ్గదని, మరింత పట్టుదలతో ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.ఇందులో ఉపసర్పంచ్‌ల జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు ముడికే మల్లేష్ యాదవ్, ముస్కు రాజేందర్, బీసీ డిపార్ట్‌మెంట్ మండల అధ్యక్షులు ముంజ ప్రసాద్ గౌడ్, చిట్యాల సర్పంచ్ భీమేష్, యూత్ మండల ఉపాధ్యక్షులు రాజు, బీఎల్ఏ ఉదయ్, గ్రామ అధ్యక్షులు మాదాసు రాజేశ్వర్, నారాయణ, లచ్చన్న, దుల్లే గంగాధర్, నాయకులు బొంతల భూమన్న, సీహెచ్ రాజేష్, సాయి, వెంకటేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.