BREAKING
బీద రవిచంద్రను కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ పోలవరం సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా కొర్రపాటి సునీత. స్వాతి పాలిక్లినిక్ ఫెర్టీలిటీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భవిష్యత్తు రవాణా ఎలక్ట్రిక్ వాహనాలదే! నేషనల్ హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేజర్లను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్ అమెరికా ఈక్విటీ ఫండ్లలో వరుసగా మూడో వారం భారీ పెట్టుబడులు స్పోర్ట్స్ కోటాలో సివిల్ సాధించి దేశానికి సేవచేయడం లక్ష్యం: శ్రీలక్ష్మి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు... యువజన విభాగం నాయకులు చల్లా సునీల్ కుమార్ ఎన్నికలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు – కాకాణి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో భారీగా పెట్టుబడుల ప్రవాహం ఆదివాసీల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు - ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రతి విధ్యార్దికి ఆరోగ్య అవగాహాన అవసరము : డా కరుణాకర్ కావలి.. 13వ వార్డులో పాలడుగు పద్మశ్రీ విస్తృత ప్రచారం. కావలిలో ముమ్మరంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం సావిత్రమ్మను భారీ మెజార్టీతో గెలిపించండి. డాక్టర్ తలారి రంగయ్య.

అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి
సూర్య, మందమర్రి : కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం ఎదురైనా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియకు మందమర్రి పురపాలక సంఘం శ్రీకారం చుట్టింది. పట్టణంలోని అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కోరారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సంపాదించే సభ్యుడికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు 19వ వార్డులోని మున్సిపల్ కార్యాలయంలో తొలి నమోదు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నమోదు కోసం బీమా పొందే వ్యక్తి ఆధార్ కార్డుతో స్వయంగా హాజరుకావాలని సూచించారు. కుటుంబ రేషన్ కార్డు, సభ్యుల ఆధార్ కార్డులు, సంపాదించే వ్యక్తి మొబైల్ నంబర్, నామినీ వివరాలను వెంట తీసుకురావాలని తెలిపారు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే వారికి కేటాయించాల్సిన బీమా వాటాల వివరాలను కూడా నమోదు సమయంలో తెలియజేయాలని పేర్కొన్నారు. మిగిలిన వార్డుల్లోనూ దశలవారీగా నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, వాటి వివరాలను త్వరలో ప్రకటిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ పథకం ద్వారా లభించే రూ.5 లక్షల బీమా భద్రతను అర్హులైన కుటుంబాలు కోల్పోకుండా నిర్ణీత కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.