BREAKING
శ్రీ దేవి జగదాంబ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు. అదనపు షేర్ల కొనుగోలుతో ఆంథ్రోపిక్ ఐపీఓ నిధుల సమీకరణ 93.5 బిలియన్ డాలర్లకు చేరిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చందూలాల్ కుమార్ రెడ్డి పొలాలను పరిశీలించిన అధికారులు రూ.1.15 కోట్ల విలువైన సిగరెట్ల లారీ సీజ్‌.. విజిలెన్స్ అధికారుల మెరుపు దాడి ఓ పి ఎస్ పెన్షన్ విధానం మార్పుపై హర్షం సంఘ సభ్యుడి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత పెర్కంపల్లి హల్దీ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నేత విఠల్‌ రెడ్డి ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలలో సాఫ్ట్వేర్ కంపెనీకి 10 మంది విద్యార్థుల ఎంపిక ఉపాధి హామీ పనులకు కూలీలు క్రమం తప్పకుండా హాజరుకావాలి - ఎంపీడీఓ నాగేశ్ జాతీయ రహదారి పై ఇద్దరు యువకులు మృతి. భూ రికార్డులకు డిజిటల్ భద్రత.. వివాదాలకు శాశ్వత పరిష్కారం! బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి : డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ శంకుస్థాపన ఉక్రెయిన్‌లో చిన్నారుల మరణాల సంఖ్య 2022 స్థాయికి చేరువ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో బీదా రవిచంద్ర మర్యాదపూర్వక భేటీ

స్పోర్ట్స్ కోటాలో సివిల్ సాధించి దేశానికి సేవచేయడం లక్ష్యం: శ్రీలక్ష్మి

Select Suryaa Now
స్పోర్ట్స్ కోటాలో సివిల్ సాధించి దేశానికి సేవచేయడం లక్ష్యం: శ్రీలక్ష్మి

గుంటూరు: జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన తాడిబోయిన శ్రీలక్ష్మి రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ప్రస్తుతం గుంటూరులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువు తున్న శ్రీలక్ష్మి, ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది. త్వరలో తిరుపతి సమీపంలోని పొత్తూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఆమె పాల్గొన నుంది. ఈ పోటీల్లోనూ సత్తా చాటి జాతీయ స్థాయికి వెళ్లడమే తన తదుపరి లక్ష్యమని శ్రీలక్ష్మి ధీమా వ్యక్తం చేసింది.శ్రీలక్ష్మి ఇప్పటికే మూడుసార్లు జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. క్రీడలతో పాటు జాతీయ స్థాయి కార్యక్రమాలు, సామాజిక అంశాలపై జరిగే సదస్సులక హాజరవుతున్నారు. అలాగ ​ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొంది.గుజరాత్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'ప్రేరణ'  కార్యక్రమంలో పాలుపంచుకుంది.​'వికసిత్ భారత్' కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనపై జరిగిన జాతీయ సెమినార్‌కు హాజరైంది. వివిధ సెమినార్లలో విజేతగా నిలిచి గుంటూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఈఓ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకుంది.ఈ సందర్భంగా తాడిబోయిన శ్రీలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా ద్వారా సివిల్స్‌కు ప్రిపేర్ అయి, ఉన్నత అధికారిగా దేశానికి సేవ చేయాలన్నదే తన ఆశయమని తెలిపింది. దాతలు, స్పాన్సర్లు ముందుకు వచ్చి తనకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే మరింత బాగా చదువుకుని, క్రీడల్లో రాణిస్తూ తన గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని పేర్కొంది. భవిష్యత్తులో తాను స్థిరపడ్డాక పేద విద్యార్థుల చదువులకు తన వంతు సహాయం అందిస్తానని ఆమె ఆకాంక్షించింది.రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీలక్ష్మిని గుంటూరు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ ప్రత్యేకంగా అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సూర్య నాయక్